గోదాముల్లో మగ్గుతున్న ధాన్య సంగతేంటి

ఎన్నికలకు ముందు మన్మోహన్‌ను నిలదీసి చేసిందేమిటి

ఆనాటి హావిూలు ఏమయ్యాయో మోడీ ఆలోచించారా?

ధాన్యం పేదల ఆకలిని ఎందుకు తీర్చలేకపోతోంది

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : కేంద్రం తీసుకుని వచ్చిన సాగుచట్టాల కారణంగా రైతులకు మద్దతు ధరలు లేకుండా చేయాలన్న కుట్ర కూడా దాగి ఉంది. మూడు వ్యవసాయ చట్టాల అమలుకు దొడ్డిదారి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గోదాములు ఖాళీ లేనందున రైతుల పంటలను కనీస మద్దతు ధర కు కొనుగోలు చేసేది లేదన్న కేంద్ర ప్రభుత్వ తీరు దుర్మార్గమైనదిగా గుర్తించాలి.  ఒకవైపు అన్ని పంటలకూ ఎంఎస్‌పిని వర్తింపజేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని లక్షలాది రైతులు ఏడాదిగా ఢల్లీి సరిహద్దుల్లో మోహరించి ఆందోళన చేస్తుండగా, అస్సలు ధాన్యాలను కొనుగోలు చేసేదే లేదనడం, గోడౌన్లను సాకుగా పేర్కొనడం అన్నదాతల పట్ల, వ్యవసాయం పట్ల మోడీ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ విధానాలను తెలియచేసింది. ఖరీఫ్‌ పంటలు మార్కెట్‌కొచ్చే వరకు గోదాముల్లోని నిల్వలను ఖాళీ చేయించాల్సింది ప్రభుత్వమే. ఉద్దేశపూర్వకంగా గోడౌన్లలో నిల్వలను కదలనీకుండా, ముక్కపెట్టేందుకైనా సిద్ధపడుతూ, ఆ పేరుతో కొత్త పంటలను కొనుగోలు చేయకుండా చేతులు కట్టేసుకోవడం వెనుక పెద్ద కుట్రే దాగుంది. ఆహార ధాన్యాలు అంత పెద్ద మొత్తంలో గోడౌన్లలో మూలగడ వల్ల పేదలకు ఆహారాధాన్యలు అందకుండా పోయాయి. నిజానికి గోడౌన్లలో మూలుగుతున్న ధాన్యాన్ని పేదల ఆకలి తీర్చే ందుకు ఉపయోగించి ఉంటే బాగుండేది. అధికారంలోకి రాకముందు ఈ విష:యంలో కూడా మోడీ ఆనాటి మన్మోమన్‌ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. వరల్డ్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో మనల్ని ఎక్కడో అట్టడుగున నిలిపింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి అధమంగా ఉందని ధర్నా సందర్భంలో మరోమారు సిఎం కెసిఆర్‌ కూడా ప్రస్తావించారు. ఏడేళ్లలో ప్రజల తలసరి ఆహార వినియోగం 9 శాతం తగ్గిందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే బహిర్గతం చేసింది. పేదరికం పెరుగుతోందని, ఆకలి భారతం నిర్మాణమవుతోందని నిర్దారించడానికి ఇంతకంటే కొలమానం అక్కర్లేదు. ఈ కాలంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందేవిూ లేదు. ఉత్పత్తి పెరగకుండానే గోదాముల నిండా పాత నిల్వలను అలాగే ఉంచడం ఎక్కడి దౌర్భాగ్య విధానమో ప్రభుత్వం చెప్పాలి.  పౌష్టికాహారం లోనూ భారత్‌ది అదే పరిస్థితి. ప్రజల ఆకలిని తీర్చేందుకు  యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలను సేకరించి ఉచితంగా పంచగలిగితే పేదలకు రెండుపూటలా ఆకలి తీరేది.  బిజెపి సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా ధాన్యాలను ముక్కపెట్టడానికి, ఎలుకలు, పందికొక్కుల పరం చేయడానికైనా సిద్ధపడిరదనే చెప్పాలి. గోదాముల్లో ముక్కిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచేందుకు పెద్దమనసు చేసుకోలేక పోయింది. కరోనా వలన కోట్లాది మంది పేదరికంలోకి జారిపోయి  తిండికి వెతుక్కోవాల్సిన దుర్గతి ఏర్పడిరది.  రైతులు పంట పండిరచడానికి పెట్టే ఖర్చుకు యాభై శాతం కలిపి ఎంఎస్‌పి ఇవ్వాలని స్వామినాథన్‌ సిఫారసు చేయగా, ఆ సూచనను అమలు చేయలేమని ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. ఇప్పుడు మొత్తానికే ఎంఎస్‌పికి ఎసరు పెట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చింది. వాటి అమలును పట్టాలెక్కించే కుతంత్రంలో భాగమే సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సిడబ్ల్యుసి) ఆస్తుల మోనిటైజేషన్‌ చేపట్టారు.  ఇప్పటికే ప్రొక్యూర్‌మెంట్‌ డీసెంట్రలైజేషన్‌తో ఎఫ్‌సిఐ నిర్వీర్యమైంది. ఎఫ్‌సిఐకి నిధులివ్వకుండా, బకాయిలు పెట్టి సర్కారే సంస్థను అప్పుల పాల్జేసింది. రైతుల పంటల కొనుగోళ్ల బాధ్యత నుండి వ్యూహాత్మకంగా తప్పుకుంటోంది. ఒకే జాతి`ఒకే రేషన్‌ కార్డు, నగదు బదిలీ వంటి చర్యలు ఆహార ధాన్యాల సేకరణ, మార్కెట్‌, పంపిణీపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యత నుండి తప్పించేవిగానే చూడాలి.  కేంద్ర ప్రభుత్వ విధానం ప్రజల ఆహార భద్రతకు, రైతు మనుగడకు పెనుముప్పుగా మారిందనడంలో సందేహం లేదు. ఇలాంటి చర్యలతో రైతులకను దగా చేయాలని యోచించిన మోడీకి తలబొప్పి కట్టిందనే చెప్పాలి.