గోపాల్‌పూర్‌ బీచ్‌లో కాలుష్యం పెరిగింది

ఒడిషా,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పూరీలో ఉన్న బీచ్‌కన్నా గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ బీచ్‌ అత్యంత కలుషితమైందని ఒక అధ్యయనం కనుగొంది. బెర్హంపూర్‌ యూనివర్సిటీ, చెన్నై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌తో కలిసి నిర్వహించిన అధ్యయనం ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు.  సెప్టెంబర్‌ 21న ఇంటర్నేషనల్‌ కోస్టల్‌ క్లీనప్‌ డే సందర్భంగా గోపాల్‌, పూరీ, రుషికుల్య నది నుంచి వృధాపదార్ధాలను సేకరించి విశ్లేషించినట్టు, మెరైన్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి ప్రతాప్‌ చంద్ర మొహంతీ మంగళవారం వెల్లడించారు.
గోపాలపుర్‌ బీచ్‌లో ఒక చదరపు విూటర్‌కు 3.60గ్రాల ఘనవృధా ఉండగా, పూరీ బీచ్‌లో ఒక చదరపు విూటరుకు 1.20 గ్రా.ల వృధా ఉందని మొహంతి తెలిపారు. సేకరించిన చెత్తలో కూల్‌ డ్రింక్‌ బాటిళ్ళు, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లు, సిగిరెట్‌ ప్యాకెట్లు, చేపలు పట్టే నెట్లు ఉన్నట్టు తెలిపారు.
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సవిూక్షించవచ్చుః ఎపి హైకోర్టు
అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సవిూక్ష సాధ్యం కాదన్న విద్యుత్‌ కంపెనీలకు షాక్‌ తగిలింది. పీపీఏలపై సవిూక్షకు అవకాశమే లేదన్న కంపెనీల వాదనల్ని హైకోర్టు మంగళవారం కొట్టిపారేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, ప్రజాధనం వృదా చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ఈ ఒప్పందాలను ఏపీఈఆర్సీ ద్వారా సవిూక్షిస్తామని తెలిపింది. కోర్టు ఈ వాదనలను  సమర్థించింది. ఇకపై పీపీఏల రివ్యూకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని సూచించింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్సీకి స్పష్టం చేసింది.
ఈ ఆరు నెలల్లోపు మధ్యంతర చెల్లింపు కింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ.2.44 చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకూ హైకోర్టు ఓకే చెప్పింది.  ప్రభుత్వం నోటీసులు ఇచ్చి, చట్టం ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపి వేసే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. పీపీఏలపై రివ్యూ వ్యవహారం గతంలో ప్రభుత్వం కోరిన విధంగా ఏపీఈఆర్సీ వద్దకు చేరడంతో హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు చెప్పింది.