గ్రామ బాలల పరిరక్షణే ద్యేయం :బాబగూడ ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి

గ్రామ బాలల పరిరక్షణే ద్యేయం :బాబగూడ ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేట మండలంలోని బాబ గూడ గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ లత మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల బాలబాలికల రక్షణ మరియు సంరక్షణ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పిల్లల భద్రత అందరి బాధ్యత అన్నారు, ప్రతినెల గ్రామసభ లో బాల బాలికల మరియు మహిళల సమస్య లను చర్చించుకుంటామని అన్నారు. గ్రామ ఉప సర్పంచ్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల రక్షణకు, మహిళల భద్రతకు నెలలో గ్రామసభలో చర్చించుకుంటామని బాల బాలికలపై జరుగుతున్న అఘాయితులపై, బాల్య వివాహాలకు, బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా చూస్తామన్నారు. ఇందులో భాగంగా మేడ్చల్_మల్కాజ్గిరి జిల్లా బాలల పరిరక్షణ సభ్యుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాల బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా 1098 కాల్ చేయవచ్చని ఈ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ జాతీయస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలో గ్రామంలోని బాల్య వివాహాలు, బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, పిల్లలు బాల కార్మికులు గా పనిచేయరాదని, బిక్షాటన చేస్తున్న పిల్లలు కనిపించిన, తప్పు పోయిన పిల్లల గురించి తెలిసిన, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మరియు చిన్నారుల భద్రతకు ఎంతగానో ఈ టోల్ ఫ్రీ నెంబర్ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో ఎలాంటి వివాహాలు జరిగిన గ్రామపంచాయతీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వినోద, మహిళా మండలి సభ్యురాలు, గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,గ్రామ పాలక సభ్యులు, గ్రామ ప్రజలు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
13ఎస్పీటీ -1: సమావేశం లో మాట్లాడుతున్న సర్పంచ్