“ఘనంగా ఆర్ డి ఆర్ జన్మదిన వేడుకలు”
ఫోటో: కేక్ కట్ చేస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు
పెన్ పహాడ్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) : మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ రాష్ట్ర పి.సి.సి ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో భారీగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం దేవాలయం లో పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సూర్యపేట రాంరెడ్డి దామోదర్ అత్యధిక మెజార్టీ తో గెలుపొందడం జరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పిన్నని కోటేశ్వరావు భూక్య శివ నాయక్ నారాయణ ప్రవీణ్ రెడ్డి. సైది రెడ్డి.మండలి పిచ్చయ్య. దొంగరి సైదులు కత్తి రవీందర్ షేక్ సైదులు రాంబాబు ఒగ్గు రవి ఒగ్గు సైదులు ముదిగొండ శ్రీనివాస్.కరింగుల రాజు.కోడిదల రాంబాబు.సతిష్.నీలకంఠ0 జానకిరామ్.తదితరులు పాల్గొన్నారు
Attachments area