ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు
వేములవాడ సెప్టెంబర్ 10 (జనంసాక్షి) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ మహిళ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 37 వ వర్థంతి పురస్కరించుకుని వేములవాడ రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, తెలంగాణ చౌక్ లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఐలమ్మ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు,ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చింతల్తడెం దేవయ్య,ఉపాఢ్యక్షుడు రమేష్,కార్యదర్శి శ్రీకాంత్,కోశాధికారి కిషన్,దేవరాజ్,మర్రిపల్లి రాజు,వనపర్తి శంకర్,మల్లేశం,శ్రీను,నర్సయ్య,సత్తయ్య,శ్రీనివాస్,రాము,గంగయ్య,సంఘసభ్యులు తదితరులు ఉన్నారు.