ఘనంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

ధర్మపురి సెప్టెంబర్ 16( జనం సాక్షి న్యూస్) మండలంలోని 75వ,వజ్రోత్సవ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అధికారికంగా16,17,18 ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఎస్ పి సింధు శర్మ, డిఎస్పి ప్రకాష్, స్థానిక తహశీల్దార్ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో ప్రవీణ్, సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అంబేద్కర్ చౌక్ వద్ద సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన కార్యక్రమాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవ 75వ,వజ్రోత్సవ అధికారికంగా స్కూల్ విద్యార్థులచే జాతీయ జెండాలతో మరియు వివిధ ఉద్యోగులచే మహిళా సంఘాల ద్వారా,పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా అంబేద్కర్ చౌకు వద్దకు మంత్రి చేరుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఆయన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నంది చౌక్ వద్ద నుండి గాంధీ చౌక్ నుండి భారీగా తరలివచ్చిన జన సమూహంతో కలిసి జూనియర్ కాలేజీ లో కొత్తగా ఏర్పరచుకున్నటువంటి తెలంగాణను గూర్చి ఆయన ప్రజలకు సంక్షేమ పథకాల గూర్చి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ, జడ్పిటిసి బత్తిని అరుణ,ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు,ఏఎంసి చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్,వైస్ చైర్మన్ అక్కెనపల్లి సునీల్,టెంపుల్ చైర్మన్ ఇందారపు రామన్న,భీమయ్య వివిధ గ్రామాల నుండి సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.