చిన్మయానందను విచారించిన పోలీసులు

– అర్థరాత్రి వరకు అత్యాచార కేసులో విచారణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  షాజహాన్పూర్‌ అత్యాచారం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిన్మయానందను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుమారు ఏడు గంటల పాటు విచారించారు. అంతేకాకుండా ఆశ్రమాన్ని మూసివేసింది. ఓ న్యాయ విద్యార్ధిపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో గురువారం రాత్రి యూపీ పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి ఒంటగంట వరకు విచారణ కొనసాగింది. గురువారం సాయంత్రం చిన్మయానంద ఆశ్రమానికి వెళ్లిన పోలీస్‌ అధికారు.. సాయంత్రం 6:30 గంటల నుంచి అర్థరాత్రి  వరకు ప్రశ్నించారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిన్మయానందకు కేవలం ఒకే ఒక్క గది ఉంచి మిగతా ఆశ్రమానికి సీల్‌ వేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు చిన్మయానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. ఇదిలాఉంటే  చిన్మయానంద పోలీసులు విచారణకు సహకరిస్తున్నట్లు ఆయన లాయర్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయశాస్త్ర విద్యార్థిని చిన్మయానంద తనను బెదిరించాడని, వీడియోలు తీసి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. పోలీసులు విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. కానీ ఆ రాజకీయ నేతపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఒక సంవత్సరం పాటు తనను లైంగికంగా వేధించాడని న్యాయ విద్యార్థిని పోలీసులకు చెప్పింది. చిన్నయానంద పేరిట యూపీలో అనేక ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నియమితి సిట్‌ ముందు కూడా ఆ విద్యార్థిని బీజేపీ నేతపై ఆరోపణలు చేసింది. షహజాన్‌పూర్‌ కాలేజీలో చేరే ముందు చిన్మయానందను కలిశానని, అప్పుడు అతను ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడని, కాలేజీ లైబ్రరీలో ఉద్యోగం కూడా ఆఫర్‌ చేశాడని ఆమె తెలిపింది. తొలతు హాస్టల్‌లో సీటు ఇప్పిండాని, ఆ తర్వాత ఆశ్రమానికి రమ్మన్నాడని చెప్పింది. హాస్టల్‌లో స్నానం చేస్తుంటే వీడియో తీసి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని తెలిపింది. ఆ తర్వాత రేప్‌ చేసి వీడియో తీసి కూడా పదేపదే మోసం చేశాడని లా విద్యార్థిని కోర్టు కమిటీ ముందు వెల్లడించింది.  తాను వీడియో ఆధారం సమర్పించినప్పటికీ సిట్‌ పోలీసులు చిన్మయానందపై చర్యలు తీసుకోలేదంటూ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే చిన్మయానంద తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ లైవ్‌ వీడియో విడుల చేసిన బాధితురాలు అనంతరం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమె రాజస్థాన్‌లో ఉన్నట్టు ఇటీవల యూపీ పోలీసులు గుర్తించారు.