జమ్మూకశ్మీర్‌లో 144 సెక్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

 శ్రీనగర్‌,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాజస్థాన్‌లో కూడా 144 సెక్షన్‌ విధించారు. 144 సెక్షన్‌ నవంబర్‌ 19 వరకు అమల్లో ఉండనుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు రాజస్థాన్‌ ప్రభుత్వం సెలవులు
ప్రకటించింది. అజ్మీర్‌లో రేపు ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మహారాష్ట్రలోనూ 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. 4 వేల కేంద్ర బలగాలు యూపీలో మకాం వేశాయి. ఈ బలగాలు నవంబర్‌ 19 వరకు యూపీలోనే ఉండనున్నాయి.