జవాను కుమారుడి.. అనుమానాస్పద మృతి

 

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : సైనికులకు అందిస్తున్న ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేదని వీడియోలను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ కుమారుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హరియాణాలోని రేవారిలో వారి ఇంట్లో గదిలో 22ఏళ్ల రోహిత్‌ మృతదేహం లభ్యమైంది. లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న గదిలో.. రోహిత్‌ మృతదేహం మంచంపై పడి ఉందని, అతడి చేతిలో తుపాకీ ఉందని పోలీసులు వెల్లడించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయడంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో తేజ్‌ బహదూర్‌ కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారు. ఆయనకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. సైన్యంలో ఆహారం గురించి ఫిర్యాదు చేస్తూ వీడియోలు సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన తర్వాత సైన్యం తేజ్‌ బహదూర్‌ను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. 2017 జనవరిలో ఆయన వీడియో పోస్ట్‌ చేయగా.. ఈ అంశంపై విచారణ జరిపేందుకు బీఎస్‌ఎఫ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. తేజ్‌ బహదూర్‌ వీడియో వైరల్‌ కావడంతో గతంలో ¬ంశాఖ కూడా విచారణకు ఆదేశించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రధాని మోదీ కూడా ఆదేశించారు.