జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మంతిని సునీత
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 16(జనం సాక్షి)
హైదరాబాద్ ఎల్.బి నగర్ లోని పద్మశాలి భవన్ లో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వరంగల్ జిల్లాలోని శంభునిపేట చెందిన మంతిని సునీత రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది. తన నియామకానికి సహకరించిన జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ , మాజీ మంత్రి కొండా సురేఖ , వరంగల్ మేయర్ గుండు సుధారాణి ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడెపు నగేష్ లకు మంతిని సునీత కృతజ్ఞతలు తెలిపారు.