జాతీయ స్థాయి కరాటే పోటీలో జనగామ విద్యార్థుల ప్రతిభ.
జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్20:జాతీయ స్థాయి కరాటే పోటీలో జనగామ విద్యార్థుల ప్రతిభ. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ పౌండర్ బి. సైదులు వారి చే నిర్వహించిన కల్నల్ సంతోష్ బాబు స్మారక జాతీయ స్థాయి కుంగ్ పు మరియు కరాటే చాంపియన్ షిప్ పోటీలలో జనగామకు చెందిన న్యూ స్టార్ చైనీస్ కుంగ్ పూ విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుపొందారని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుగ్గిళ దేవేందర్ తెలిపారు గెలుపొందిన వారిలో మహఫూస్ (గోల్డ్) , సభ (సిల్వర్) , అఖిల్ పాషా(గోల్డ్) , బిందునాయక్ (గోల్డ్) , దైవిక్ (గోల్డ్) , విశ్వ (గోల్డ్) , ప్రవళిక (సిల్వర్) , సాయి గణేష్ (సిల్వర్) , హర్షవర్ధన్(గోల్డ్) , స్వప్న (సిల్వర్) ,పథకాలు గెలుపొందారు వీరిని గ్రాండ్ మాస్టర్ ఎండి సలీం పాషా అభినందించారు.