జిఎస్టీ శ్లాబుల్లో మార్పులకు రంగం సిద్దం

18న జరిగే మండలి సమావేశంలో చర్చించే అవకాశం

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాబడుల్లో లోటును భర్తీ చేసుకునేందుకు వచ్చే ఏప్రిల్‌ నుంచి జిఎస్‌టి రేట్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎక్కువ ధరలున్న ఉత్పత్తులు, సేవా పన్నులపరంగా చూస్తే ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచే మార్చాలని జిఎస్‌టి మండలి ఈ మేరకు మొత్తం రేట్ల శ్లాబ్‌లను ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం. రాబడుల్లో సంక్షోభం రావడంతో లోటుభర్తీకి ప్రభుత్వం ఇపుడిపుడే చర్యలు చేపట్టింది. ఐదుశాతం శ్లాబ్‌ను కూడా ఆరు నుంచి 8శాతానికి మారుస్తుందని అంచనా. ఇక 12శాతం శ్లాబ్‌ను తీసివేయాలని కూడా చూస్తోంది. ఈ శ్లాబ్‌ స్థానంలో కొన్నింటిపై 18శాతం శ్లాబ్‌ను ప్రవేశపెట్టేందుకు మండలి యోచిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జిఎస్టీ మండలి సమావేశం ఈ నెల 18వ తేదీ జరగనున్నది.అంతేకాకుండా 5,12,18,28 శ్లాబ్‌లను కూడాప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. 28శాతం కేటగిరీకి మరికొంత సుంకం విధించాలని, ఒకటి శాతం నుంచి 25శాతం వరకూ సుంకాలు కూడా విధించాలని చూస్తు న్నది. కేంద్ర రాష్టాల్ర నుంచి వచ్చిన కొందరు అధికారుల బృందం మంగళవారం సమావేశం అయి రేట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సిఫారసులు చేసారు. ఐదు నుంచి ఎనిమిది శాతం 15 శాతం నుంచి 15శాతానికి మార్చాల న్నది కొత్త ప్రతిపాద నలుగా ఉన్నాయి. జిఎస్టీ మండలిలో ఈ అధికారుల బృందం ఇచ్చిన సిఫారసులపై విస్తృత స్థాయి చర్చజరగ నున్నది. కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ జరిగే జిఎస్‌టి మండలి సమా వేశంలో కొత్త రేట్‌ నిర్మాణ క్రమాన్ని ప్రకటించనున్నట్లు చెపుతున్నారు. దిగువస్థాయిలో ఉన్న శ్లాబ్‌లను మార్చడానికి రాష్టాల్రఆర్థిక మంత్రులు మాత్రం అంగీకరించడంలేదు. జిఎస్‌టి రాబడులను సవిూక్షించడంతోపాటు అనేక రాష్టాల్రకు బకాయిలున్న పరిహారం చెల్లింపులపై కూడా చర్చిస్తారు. కొన్ని శ్లాబులను విలీనంచేసే ప్రతిపాదన కూడా తెచ్చారు. మొత్తం శ్లాబ్‌లను మూడుకు మించకుండా చూడా లని కూడా అధికారులు సిఫారసు చేసారు. కొన్ని సేవలపై సెస్‌ను విధించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. కేంద్ర జిఎస్‌టి రాబడులు బ్జడెట్‌ అంచనాలకు అనుగుణంగా లేవు. 40శాతం దిగజారాయి. ఏప్రిల్‌ నవం బరు మధ్యకాలంలోనే హెచ్చు తగ్గులున్నాయి.

కేంద్ర జిఎస్‌టి రాబడులు ఏప్రిల్‌ -నవంబరు నెలల్లో 3,28,365 కోట్లుగా ఉంది. బ్జడెట్‌ అంచనాలు మాత్రం 5,26,000 రూపాయలుగా ఉన్నాయి. 2018-19లో సిజిఎస్‌టి రాబడు లు 4,57,534 కోట్లుగా ఉన్నాయి. ఇక అంచనాల పరం గా చూస్తే 6,03,900గా నిలిచింది. 2017-18పరంగా సిజిఎస్‌టి రాబడులు 2,03,261 కోట్లుగా ఉంది. జిడిపి వృద్ధి 26 తైమ్రాసికాల కనిష్టానికి చేరింది. 4.5శాతంగా ఉంది. 2012-13నాటి కనిష్టస్థాయిని నమోదు చేసింది. అప్పట్లో 4.3శాతం మాత్రమే జిడిపి వృద్ధిరేటుగా వచ్చింది. రాబడులు పెంచేందుకు వీలుగా ఇప్పటికే జిఎస్‌టి మండలి అన్ని రాష్టాల్రకు లేఖలు రాసింది.