జైలులో జగన్‌ను కలిసిన మోహన్‌బాబు
హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌లను సినీ నటుడు మోహన్‌బాబు నేడు పరామర్శించారు. మధ్యాహ్నం 12:30గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు వచ్చిన మోహన్‌బాబు మలాఖత్‌లో జగన్‌ను, మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను కలిశారు. జగన్ వరసకు మేనల్లుడైనందునే ఆయన్ను కలిసినట్లు మోహన్ బాబు తెలిపారు. న్యాయం, ధర్మం గురించి తాను మాట్లాడబోనని వాస్తవాలేమిటో భగవంతుడికే తెలుసని అన్నారు. అన్ని నిజాలు త్వరలోనే బయటపడతాయని, జగన్ ప్రసాద్‌లు త్వరలోనే బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహాభారతంలో శకునిలు ఉన్నట్లు ఢిల్లీలోనూ ఉన్నారని ఆరోపించారు. వైకాపాలో చేరతారా అన్న విషయంపై మాట్లాడేందుకు మోహన్‌బాబు నిరాకరించారు.