టీఎస్ యుటిఎఫ్ 5వ రాష్ట్ర మహ సభలు విజయ వంతం చేయాలి. రాష్ట్ర కార్యదర్శి గాలయ్య
టీఎస్ యుటిఎఫ్ ఐదవ రాష్ట్ర మహాసభలు జనవరి 13 14 15 తేదీలలో బి ఎం ఆర్ సార్త ఫంక్షన్ హాల్ మన్నెగూడలో జరగనున్నాయి, రాష్ట్ర మహాసభలకు విరాళం గురించి రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, ఉపాధ్యాయులు యాచారం మండలం లోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 సంవత్సరాల నుండి ప్రమోషన్లు మరియు బదిలీలు లేక వివిధ పాఠశాలల్లో అనేక ఖాళీలు ఏర్పడినాయని,దీనివల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీనమవుతుందని అన్నారు.పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రమోషన్లు మరియు బదిలీలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.317 జీవో కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు తమ స్థానిక జిల్లాలను కోల్పోయి ఎంతో దూరంలో ఇతర జిల్లాల్లో ఉన్న పాఠశాలల్లో పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భాషా పండితులను వారి పోస్టులతో సహా అప్ గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల క్రితం జీవో ఇచ్చినప్పటికీ అది ఇప్పటివరకు అమల్లోకి రాలేదని అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఉపాధ్యాయుల నియామకం చేపట్టకుండా, ఏకో ఉపాధ్యాయులతో ఐదు తరగతులను నడిపిస్తూ టాస్క్ ఫోర్స్ లను నియమించి పర్యవేక్షణ చేస్తామనడం చాలా దారుణమని దుయ్యబట్టారు. భరోసా లేని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలో నాలుగు రాష్ట్రాలు నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతనంగా రూపొందించిన సమయసారిణిని సవరించాలని అన్నారు. అలాగే వేసవికాలంలో పదవ తరగతి పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈ ఎల్ ఎస్ జీవో ను వెంటనే విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ని కోరారు ఈ కార్యక్రమంలో యాచారం మండలం అధ్యక్షులు సలువాల నర్సింహా, ప్రధాన కార్యదర్శి పి అంజయ్య, రంగారెడ్డి జిల్లా వోట్ కన్వీనర్, జిల్లా కౌన్సిలర్ టి యాదయ్య, మహేష్, మదర్ తదితరులు పాల్గొన్నారు