టెక్నాలజీ మాంత్రికుడి తిరోగమన వ్యాఖ్యలు

ఇవిఎంలపై చంద్రబాబు పసలేని ఆరోపణలు

నిపుణులతో పరిశీలన ఎందుకు చేయించరు?

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): టెక్నాలజీ అంతా తన చలవే అన్న చంద్రబాబు కూడా ఇవిఎంలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇవిఎంలను తానే ప్రవేశ పెట్టానని, సెల్‌ఫోన్‌ రాక తన చలవే అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకనో ఇవిఎంలంటేనే భయపడుతున్నారు. ప్రజలు తనవైపు లేరన్న భావనలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. టెక్‌ సిఎంగా ఉన్న చంద్రబాబు నాలుగు ఇవిఎంలను తెప్పించుకుని తనవద్ద ఉన్న సైబర్‌ నిపుణులతో పరిశీలన చేయవచ్చు. గుడ్డిగా ఆరోపణలు చేసే బదులు అమరావతి వేదికగా తన టీమ్‌తో పరిశీలన చేయవచ్చు. కానీ అలా చేయడం లేదు. చేస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అన్న భయం పట్టుకుని ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ గెలవడంతో ఇదే వాదన తీసుకుని వచ్చారు. ఇవిఎంలు వద్దు ..బ్యాలెట్‌ ముద్దు అంటూ వచ్చారు. ఇప్పుడు మాయావతి, మమతా బెనర్జీ,అఖిలేశ్‌ యాదవ్‌ లాంటి వారు కూడా ఇదే అనుమానంలో ఉన్నారు. తాజాగా ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే పల్లవి

అందుకున్నారు. గత ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో బిజెపి పాగా వేయడంతో తట్టుకోలేకపోతున్న విపక్షాలు తమ అక్కసును ఇవిఎంలపై మోపుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజార్టీతో ఊహించని స్థాయిలో గెలవడంతో ఈ చర్చ మొదలు పెట్టారు. ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల రాజకీయాల గురించి, ప్రధానంగా ఇవిఎంల గురించి విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఇవిఎంలు ట్యాంపర్‌ అయ్యాయని, లేకుంటే యూపిలో బిజెపికి అంత సీన్‌ లేదన్న వాదన తీసుకుని వచ్చింది. మొత్తంగా ఇవిఎంల వ్యవహారం మరోమారు చర్చగా మారింది. విపక్ష పార్టీలతో పాటు, వారికి వత్తాసు పలికే విూడియా దీనిని జీర్ణించుకోలేకపోతున్నది. సంప్రదాయ విూడియాలో, సోషల్‌ విూడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలయింది. గతంలో ఎరుగని ఉత్పాతమేదో ఇప్పుడు కొత్తగా ముంచుకు వచ్చిందన్న రీతిలో ఇవిఎంల బదులు బ్యాలెట్‌ పేపర్లు కావాలంటున్నారు. ప్రజాస్వామ్యం మిథ్య, ఎన్నికలు మిథ్య, ఇవిఎంలు మిథ్య అన్న పలవరింత మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ ఓడిపోవడం సహజం అనుకున్న వేళ ఇలా దారుణంగా ఇవిఎలంపై రచ్చ చేయడం చూస్తుంటే విపక్షాల్లో ఆత్మవిశ్వాసం లేదన్నది బయటపడింది. నిజంగానే వారికి కునుకు పట్టనీయడం లేదు. ఒకటిన్నర దశాబ్దాల విరామం తర్వాత భాజపాకి రికార్డుస్థాయి ఆధిక్యాన్ని అందించిన ఉత్తర్‌ప్రదేశ్‌ తమకు కాకుండా పోయిందని కాంగ్రెస్‌, ఎస్పీ, బిఎస్పీల ఆందోళనగా ఉంది. ఇక కమ్యూనిస్టులకైతే బిజెపి తప్ప ఎవరు గెల్చినా ఫర్వాలేదు. ప్రజల కోసం పనిచేసేవారు ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల పక్రియలో నెగ్గుకు రాలేకపోవడం ద్వారా తమ అసంతృప్తిని మరో రకంగా వెళ్లగక్కుతారు. రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్వాతంత్యా నంతరం జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికలలో ఓడిపోయారు. అనేక మంది కమ్యూనిస్టు యోధానుయోధులు తమ ముందు అల్పులయిన వారితో ఓటమి రుచిచూశారు. ఎమర్జెన్సీ అకృత్యాలకు బాధ్యుడిగా, ప్రతీకగా జలగం వెంగళరావును పరిగణించి, అనేక పక్షాల మద్దతుతో శ్రీశ్రీ ప్రచారంతో ఎన్నికల పోరుకు నిలిచిన కాళోజీ నారాయణరావు పరాజయం పాలయ్యారు. అందుకు ప్రజలను నిందించడమా, ఎన్నికల వ్యవస్థలోని లొసుగులను, లేదా మొత్తంగా వ్యవస్థీకృతమైన ఆధిపత్యాన్ని తప్పుపట్టడమా సరికాదు. ప్రజలు ఎప్పటి కప్పుడు చైతన్యం అవుతున్నారు. దాదాపు పదేళ్లు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ అవినీతిని ఓటు ద్వారా చీల్చి చెండాడారు. మోడీకి సంపూర్ణ మెజార్టీ అప్పగించారు. ఇదంతా ఇవిఎంల వల్లనే అంటే ఎలా? ప్రజల ఆలోచనాధోరణి,వారి అసంతృప్తిని పసిగట్టకుండా అహంకారంతో తామే గెలుస్తామని, గెలవాలని అనుకుని అలా జరగకపోవడంతో ఇవిఎంల ట్యాంపరింగ్‌ అని ఓటమిని విశ్లేషించుకుంటే దానికి బాధ్యులు ప్రజలు కాదు. ప్రజాస్వామ్యం విూద సవారీ చేస్తూ అధికారపీఠాల విూద నిలబడ్డవారి స్వభావం, లక్ష్యం అధికారం కావడం వల్లనే విశాల ప్రజానీకం తమవంతు కర్తవ్యాన్ని అవసరమైనప్పుడు నిర్వహిస్తు న్నారు. దాని ఫలితమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. అందుకు బిజెపి కూడా మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. సమాజంలోని అనేక రంగాలలో ప్రజాస్వావ్యిూకరణ కోసం ప్రయత్నాలు స్వాతంత్యాన్రికి పూర్వం నుంచీ జరుగుతున్నాయి. ప్రజలను పక్కన పెట్టి పెత్తనం చేస్తూ, వారి పేరువిూద అధికారం అనుభవించే వారికి ఈ ఎన్నికలు ఓ గుణపాఠం కావాలి. వైఫల్యాన్ని గుర్తించని, గుణపాఠాలను తీసుకోని వారు, చివరకు పురోగామి శక్తులు కూడా, పొరపాటును ఈవీఎంల విూదకు తోసివేస్తారు. ఇవిఎంల తప్పిదాలను లెక్కపెట్టకుండా తమ తప్పిదాలను సరిచూసుకుంటే మంచిది. ఈవీఎంలపై లండన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి సిబల్‌ ఏ ¬దాలో హాజరయ్యారని, ఆయన అక్కడేం చేస్తున్నారని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తరఫున ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకే ఆయన

అక్కడున్నారనేది తన ఆరోపణ అని స్పష్టం చేశారు. అయితే సిబల్‌ వ్యక్తిగతంగానే అక్కడకు వెళ్లారని కాంగ్రెస్‌ చెప్పడం సిగ్గుచేటు. శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేసిన సిబల్‌ ఈ మాత్రం నిజాలను తెలుసుకోలేని అసమర్థుడిగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిపై అందరికీ సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగేంతవరకు పాత పద్ధతైన బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలను నిర్వహించాలని తెదేపా డిమాండ్‌ చేసింది. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గుర్తించడానికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు జరగాలని, దానికి బ్యాలెట్‌ పత్రాలే పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఆయన టెక్నాలజీ ప్రచారానికి విరుద్దంగా చేస్తున్న వాదనగా చూడాలి. దమ్ముంటే వాటిలో తప్పిదాలు ఎలా ఉన్నాయో నిరూపించాలి. నిపుణులతో పరిశీలన చేయించాలి.