డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్‌పై కేసు
ముంబై: ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదు అయ్యింది. ముంబైలోని మహిమ్ పోలీసు స్టేషన్‌లో కేసు బుక్ చేశారు. ఓ మరాఠీ చిత్రంలో చిన్నారులతో అసభ్య దృశ్యాలను చిత్రీకరించినందుకు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు పెట్టారు. ఐపీసీ 292, 34 సెక్షన్లతో పాటు పోక్సో సెక్షన్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేశారు. సీమా దేశ్‌పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదు.