డ్యాన్స్‌బార్ల నిషేధంపై ఆర్డినెన్స్‌

సుప్రీం తీర్పును సవిూక్షిస్తామన్న మహా సర్కార్‌

ముంబయి,జనవరి18(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసంది. రాష్ట్రంలో డ్యాన్స్‌ బార్లను నియంత్రించేందుకు తగిన నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్‌ తెస్తామని తెలిపింది. మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లకు షరతులతో కూడిన అనుమతి ఇస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌ బార్ల లైసెన్స్‌లు, నిర్వహణపై విధించిన నిబంధనలు సరికాదని, నియంత్రణ ఉండొచ్చు కానీ అవిపూర్తి స్థాయి నిషేధానికి చేరుకోకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది. 2005 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం డ్యాన్స్‌ బార్ల ఏర్పాటుకు ఒక్కరికి కూడా లైసెన్స్‌ మంజూరు చేయని విషయాన్ని ప్రస్తావించింది.’సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ విభాగం అధికారులతో చర్చించిన అనంతరం అవసరమైతే డ్యాన్స్‌ బార్లను నిషేధించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్‌ ముంగంటివర్‌ వెల్లడించినట్లు ఓ విూడియా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘¬టళ్లు, రెస్టారెంట్లు, బార్‌ రూముల్లో అసభ్య నృత్యాల నిషేధం; మహిళల గౌరవ రక్షణ చట్టం’ పేరుతో 2016లో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ¬టళ్లు, రెస్టారెంట్ల యజమానులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌ బార్లను నిషేధించే తరహాలో చట్టాన్ని తీసుకొచ్చిందని వారు నివేదించారు.