ఢిల్లీలో పలు ప్రాంతాల్లో దీపావళి ప్రమాదాలు

200 ఘటనలకు సంబంధించి ఆరోపణలు
న్యూఢిల్లీ,అక్టోబర్‌28 జనం సాక్షి  :  దేశరాజధాని ఢిల్లీలో దీపావళి వేళ సదర్‌ బజార్‌లోని ఒక దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో దీపావళి నాడు అగ్ని ప్రమాదాలకు సంబంధించి 200 ఘటనలు చోటు చేసుకున్నట్లు ఫోన్లు వచ్చాయని తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ అగ్నిప్రమాదాలకు సంబంధించి 214 ఫోన్లు వచ్చాయన్నారు. వెంటనే తమ సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారని, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సదర్‌ బజార్‌లోని ఒక భవనం లోని ఐదవ అంతస్థులోగల దుకాణంలో నిప్పంటుకుని ఎ/-లాస్టిక్‌ సామగ్రి తగలబడిందన్నారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయన్నారు. అయితే ఇలా అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా నిర్దారణ కాలేదని అన్నారు. టపాసులు కాల్చడంపై ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ, భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం శోచనీయమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.