ఢిల్లీలో రిపబ్లిక్‌ డే రిహార్సల్స్‌

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి):దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే డ్రెస్‌ రిహార్సల్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనే వివిధ వాహనాలు కనువిందు చేశాయి. ఈనెల 26వ తేదీన రేడ్‌ నిర్వహించనున్నారు. బుధవారం జరిగిన రిహార్సల్స్‌ను భారీ సంఖ్యలో జనం ప్రత్యక్షంగా వీక్షించారు. ఆర్మీ తన ఆయుధాలను ప్రదర్శించారు. విజయ్‌ చౌక్‌ నుంచి రెడ్‌ ఫోర్ట్‌ వరకు ఈ పరేడ్‌ ఉంటుంది. అయితే ఆ రోజున మెట్రో సర్వీసులు మాత్రం ఉంటాయి. పరేడ్‌ ఉదయం 9.50 నిమిషాలకు విజయ్‌ చౌక్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. రాజ్‌పథ్‌, తిలక్‌మార్గ్‌, బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌, నేతాజీ సుభాష్‌ మార్గ్‌ విూదుగా ఎర్రకోటకు వెళ్తుంది. ఉదయం 9 గంటలకు ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు నివాళి అర్పిస్తారు. జనవరి 25 సాయంత్రం ఆరు గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్‌ను నిలిపేస్తారు. బెలూన్లు కానీ, పారా /-లగైడర్లను కానీ ఈ రూట్లో ఎగరవేయరాదు అని ట్రాఫిక్‌ అధికారులు హెచ్చరించారు.