తమిళనాడులో పొంగల్‌ వేడుకలు

జల్లికట్లుకు సిద్దమైన ప్రజలు

చెన్నై,జనవరి14(జ‌నంసాక్షి): తమిళనాడులో పొంగల్‌ వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇల్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివార్చారు. తమిళ సంప్రదాయంలో పొంగలికి ప్రాధన్యం ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2600 ఎద్దులు ఈసారి జల్లికట్టులో పాల్గొంటున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి నేపథ్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. పలు సంస్థలు, కార్యాలయాలు, పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగాచిన్నారులకు పరుగు, త్రోబాల్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. నాగపట్టణంలోని అన్నై సత్యా¬ంలోని చిన్నారులతో కలిసి కలెక్టరు ఎస్‌.సురేష్‌ కుమార్‌ పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ¬ంలో ఉంటున్న వారు 2004లో సంభవించిన సునావిూ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయిన వారని నిర్వాహకులు పేర్కొన్నారు. వారితో సరదాగా గడిపి అనంతరం సంప్రదాయ పద్ధతిలో క్టటెల పొయ్యిలో పొంగల్‌ను కలెక్టరు వండారు. కోయంబత్తూరులో సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. చెన్నై టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తిభవన్‌లో ఆదివారం ఉదయం తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఝాన్సీరాణి అధ్యక్షతన వేడుకలు జరిగాయి. పొంగల్‌ వేడులకను వీఐటీ కులపతి జి.విశ్వనాథన్‌ ఆదివారం ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల విద్యార్థులు పంచె కట్టుతో, విద్యార్థినులు చీరలు ధరించి సంబరాల్లో పాల్గొన్నారు.వ్యవసాయ పాఠశాల విద్యార్థినులతో కలిసి కొత్త కుండల్లో పొంగలి వండి వేడుకలను ఆయన ప్రారంభించారు.