తమిళనాడులో ప్రముఖ ¬టళ్లపై ఐటి దాడులు


బృందాలుగా 32 ప్రదేశాల్లో సోదాలు
ఐటి ఎగవేతల ఆధారంగానే సోదాలు
కేరళ ఘటనలో ఓ ¬టల్‌పై రాళ్ల దాడి
చెన్నై,జనవరి3(జ‌నంసాక్షి):  తమిళనాడులు అయిదు ¬టల్‌ గ్రూపులపై  ఆదాయపన్ను శాఖ దాడులు  కలకల రేపాయి. మరో వైపు కేరళ ఘటనల నేపథ్యంలో ఓ ¬టల్‌పై రాల్లతో దాడి చేశారు. ఈ ఘటనలు ఇప్పుడు తమిళనాట  కలకలం రేపాయి.  ప్రముఖ ¬టల్‌ సంస్థ శరవణ భవన్‌తో పాటు ఇతర గ్రూపులపై చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు చేపట్టింది. మొత్తం 32 ప్రదేశాల్లో దాడులు
జరిపారని తెలుస్తోంది. పన్నులు ఎగవేశారన్న ఆరోపణలపై ఈ దాడులు జరుగుతున్నాయి. సుమారు 100 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. శరవణ భవన్‌తో పాటు గ్రాండ్‌ స్వీట్స్‌, హాట్‌ బ్రెడ్స్‌, అంజాపుర్‌ గ్రూపులపై ఈ దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్‌ గ్రూపులకు సంబంధించిన డైరక్టర్ల ఇండ్లల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ¬టళ్లు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఓ ఐటీ అధికారి వెల్లడించారు. శరవణ భవన్‌ ¬టల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గ్రూపుకు దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌, సింగపూర్‌ లాంటి సిటీల్లోనూ శరవణ భవన్‌కు శాఖలు ఉన్నాయి. ఈ ¬టళ్లు బాగా పేరు ప్రఖ్యాతులు పొందాయి.
మరోవైపు చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ ¬టల్‌పై దాడి జరిగింది. థౌజండ్‌ నైట్‌లోని గ్రీమ్స్‌ రోడ్డులో గల ¬టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ¬టల్‌ అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. కాగా, శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేసథ్యంలోనే కేరళ ప్రభుత్వ ¬టల్‌పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులని పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించామని చెప్పారు.