తమిళ భాష ప్రపంచంలోనే ప్రాచీనమైంది

చెన్నైలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికయిన తరువాత మోదీ తొలిసారి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇటీవల తాను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన వేళ తమిళ పదాలను కూడా వాడానని ఆయన గుర్తుచేశారు. అలాగే ఏక ఉపయోగ ఎ/-లాస్టిక్‌ వస్తువుల వాడకం పూర్తిగా నిషేధించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎ/-లాస్టిక్‌ వాడకం వల్ల పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటోందని, ప్రజలంతా దీనిని ఓ ఉద్యమంలా భావించాలని మోదీ కోరారు.  మద్రాసు ఐఐటీలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.  భారత యువకుల సామర్థ్యంలో విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు. భవిష్యత్తు స్వప్నాలను విూ కండ్లల్లో చూస్తున్నానన్నారు. ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి స్నాతకోత్సవంలో మోదీ గుర్తు చేశారు. అక్కడ అంతా న్యూ ఇండియా గురించి చర్చించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత సంతతి ప్రజలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో భారతీయుల ఘనత అమోఘమన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందని ఆలోచించారని, దాని విూలాగే ఐఐటీల్లో చదివిన సీనియర్లే అంటూ మోదీ తెలిపారు. బ్రాండ్‌ ఇండియాను విూరంతా విశ్వవ్యాప్తం చేస్తున్నారని ప్రధాని చెప్పారు. యూపీఎస్‌సీ పరీక్షల్లో ఐఐటీ గ్రాడ్యుయేట్లు ర్యాంకులు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని తెలిపారు. భారత దేశాన్ని విూరంతా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చేస్తున్నారన్నారు.