తిరుమలలో మూడో పైవ్‌లైన్ నిర్మాణానికి అనుమతి
హైదరాబాద్: తిరుమలలో మూడో పైవ్‌లైన్ నిర్మాణానికి, సింగరేణి గనుల ఓపెన్‌కాస్ట్‌మైనింగ్‌కి రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతి లభించింది. వీటికి కేంద్రం అనుమతి కూడా అవసరమైనందున ఈ రెండు ప్రతిపానలను కేంద్ర వన్యప్రాణి బోర్డుకి పంపినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశం జరిగింది. అటవీశాఖ ఉన్నతాధికారులు మంత్రి పార్థసారధి సహా బ్లూక్రాస్ అధ్యక్షురాలు అమల తదితరలు పాల్గొన్నారు. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మూడో పైవ్‌లైన్ నిర్మాణం జరగాలంటే, రక్షిత అటవీ ప్రాంతం మీదగా పైవ్‌లైన్లు వేయాల్సి వుంది.