తెలంగాణకు జలశక్తి అభియాన్‌ అవార్డులు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 1 (జనంసాక్షి): జల్‌శక్తి అభియాన్‌ ర్యాంకులను కేంద్రం మంగళవారం ప్రకటించింది. నీటి సంరక్షణ కోసం జల్‌శక్తి అభియాన్‌ను కేంద్రం ప్రారంభించిన విషయంవ విదితమే. కాగా నీటి సంరక్షణలో ఆంధప్రదేశ్‌లోని కడప జల్లా 80.38 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 78.27 పాయింట్లతో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. 7.76 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్‌ రాష్ట్రంలోని బనాస్‌ కాంత జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాకు పదవ, వరంగల్‌ జిల్లాకు పదిహేడవ, జనగామ జిల్లాకు ప్ధదెనిమిదవ ర్యాంకులు దక్కాయి. కేంద్రం అవార్డుకు సంబంధించి మొన్న పోషన్‌ అభియాన్‌, నేడు జల శక్తి అభియాన్‌ అవార్డులను కూడా తెలంగాణ దక్కించుకున్న విషయం తెలిసిందే.