తెలంగాణ సాయుధ పోరాట హక్కుదారులు కమ్యూనిస్టులు
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి
కేసముద్రం సెప్టెంబర్ 14 జనం సాక్షి / వీరతెలంగాణ విప్లవ పోరాటంలో కమ్యూనిస్టులు చేసిన వీరోచిత పోరాటాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందని, రజాకార్లను తరిమికొట్టింది కమ్యూనిస్టులేనని, కేంద్ర బిజెపి చరిత్రను వక్రీకరిస్తూ హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రికరించే కుట్రలు చేస్తుందని, తెలంగాణ సాయుధ పోరాట హక్కుదారులు కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి అన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న జీపుజాత 2వ రోజు బుధవారం నాడు కేసముద్రం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కేసముద్రం విలేజ్ లోని తెలంగాణ సాయధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహంకు జీపు జాతకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ లో సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో విజయసారథి పాల్గొని మాట్లాడుతూ 1947 సెప్టెంబర్ 11 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు 13 నెలల కమ్యూనిస్టుల సాయుధ పోరాటాల ఫలితంగానే నిజాం నవాబు తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడని, కాగా చరిత్రను వక్రీకరిస్తూ ఏ మాత్రం ఆనాడు ఉనికిలో లేని బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతామని ప్రకటించడం హస్యస్పదమన్నారు.రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహినూద్దిన్ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొహినూద్దిన్ ముస్లిం కాదా అని బిజెపిని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసం చరిత్రను వక్రీకరిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు.భూమి కోసం,భుక్తికోసం, వేట్టి చాకిరి విముక్తికి వ్యతిరేకంగా సాగిన పోరులో 4వేల 500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు.మహబూబాబాద్ తాలుకా కమ్యూనిస్టు పార్టీ నాయకులు తీగల సత్యనారాయణ,కొండపల్లి గోపాల్ రావు, మాసబత్తిని వెంకటమల్లు, తుమ్మ శేషయ్య, దొడ్డ జగ్గయ్య, తమ్మెర వెంకట్రాం నర్సయ్య, దాసరి వెంకట్రాములు, వరిపెల్లి నర్సయ్య లతో పాటు అనేక మంది సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధికోసం, స్వలాభం కోసం కాకుండా సాయుధ పోరాట చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి చూపెట్టాలని హితవుపలికారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వ పటిమను నేటితరం కార్యకర్తలు ముందుకు తీసుకపోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ సారథి రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు నద్దునూరి అశోక్ స్టాలిన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెరుగుకుమార్, పాండురంగాచారి, చింతకుంట్ల వెంకన్న, రేషపెల్లి నవీన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వీరవెల్లి రవి, సిపిఐ మండల నాయకులు గుండు సోమయ్య, లక్ష్మీ నర్సయ్య, దాళ్వయి కిషన్ రావు, దాసరి లింగాస్వామి, చొప్పరి శరత్, ఉపేందర్, జాత బృందం సభ్యులు తండా సందీప్, కేదాస్ రమేష్, రవి నాయక్, వేణు, అలీమా, పద్మ మరియు కళా జాత బృందం సభ్యులు పాల్గొన్నారు.
Attachments area