చుకోవడం జరిగింది సుధీర్ రెడ్డి చేతుల మీదుగా నికిత బోటిక్ అండ్ సారీస్ షాప్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో మిగతవారికి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.తమ అభివృద్ధిని తామే నిర్వహించుకునే దిశగా చైతన్యమై,ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.పరిశ్రమలను,ఉపాధిని,వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని,అది దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల యూనిట్లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.డిమాండ్ను బట్టి యూనిట్లు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు.శాఖల వారిగా యూనిట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను బట్టి నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఎస్సీలను వ్యాపారులుగా తయారు చేయుటలో బిజినెస్ కల్పించి ఆర్ధికాభివృద్ధి సాధించడానికి అధికారులు ఆలోచన చేయాలని చెప్పారు.ఎంపిక చేసిన లబ్దిదారులకు 9 లక్షల 90 వేలు చెల్లించి,మిగిలిన 10 వేలకు ప్రభుత్వ వాటాగా 10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దురదృష్టవశాత్తు మరణించిన లబ్దిదారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధి ఒక ఇన్సూరెన్సు వలే ఉపయోగపడుతుందని చెప్పారు.ఇట్టి కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్,హస్తినపురం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు సత్యంచారి,సీనియర్ నాయకులు డేరంగుల కృష్ణ,శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ నాయక్,చంద్రశేఖర్ రెడ్డి,ఉదయ్ రెడ్డి,శివారెడ్డి,గోపి మధు,సయ్యద్ ధర్మకర్తలు యాదిరెడ్డి,రాజు,మల్లేష్ గౌడ్,రవి,శైలజ,నాగలక్ష్మి,సరోజ,పద్మ కాలనీవాసులు విజయ్,చిరంజీవి,మహి,సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు