దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నరేందర్
– ఉరుసు గుట్ట వద్ద అధికారులతో సమీక్ష
– హాజరైన ఎమ్మెల్సీలు, కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి)
అక్టోబర్ 3న జరిగే సద్దుల బతుకమ్మ, 5 న నిర్వహించే దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉర్సు గుట్ట వద్ద అన్ని రకాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, బండ ప్రకాష్, సి పి తరుణ్ జోషి, కలెక్టర్ గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఆర్డీవో మహేందర్ జి, తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాలను సద్దుల బతుకమ్మ ఉత్సవాలను వరంగల్ నగరంలోని ఉరుసు రంగలీల మైదానం తో పాటు ఓ సిటీ, శివనగర్, కొత్తవాడ ప్రాంతాలలో ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని విభాగాల అధికారులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంలో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల అధికారులు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ శాఖల అధికారులు సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను గొప్పగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉత్సవ కమిటీల బాధ్యులు నాగపురి సంజయ్ బాబు, మేడిది మధుసూదన్, వంగరి కోటేశ్వర్, వేలిదే శివమూర్తి, ఓగి లిశెట్టి అనిల్, గోనె రాంప్రసాద్, సందీప్, సుంకరి సంజీవ్, వంచనగిరి సమ్మయ్య, రంజిత్, మర్రి శ్రీనివాస్, ధూపం సంపత్, ఎలగామ్ సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area