దేశంకోసం 20ఏళ్లపాటు నిబద్దతతో ఆడా

– నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదు
– ట్విట్టర్‌లో మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌
న్యూఢిల్లీ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : దేశంకోసం 20ఏళ్ల పాటు నిబద్దతతో క్రికెట్‌ ఆడానిని, కానీ నేడు నావిూదే అసవనసర ఆరోపణలు చేస్తున్నారని మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల టీ20 ప్రపంచకప్‌ సెవిూఫైనెల్‌ నుంచి మిథాలీరాజ్‌ను తప్పించడంతో భారత మహిళల క్రికెట్లో మొదలైన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అయితే మిథాలీ బ్లాక్‌మెయిల్‌ చేసిందంటూ జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో రమేశ్‌ వ్యాఖ్యలపై మిథాలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది తన జీవితంలో చీకటి రోజంటూ ట్విటర్‌ వేదికగా ఆవేదన వెళ్లగక్కారు. నాపై వస్తున్న ఆరోపణలతో ఎంతో వేదనకు గురవుతున్నానని అన్నారు. ఈ దేశం కోసం 20ఏళ్ల పాటు ఎంతో నిబద్ధతతో ఆడానని, కానీ నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదన్నారు. ఈరోజు నా దేశభక్తిని అనుమానిస్తున్నారని, నా నైపుణ్యాలను ప్రశ్నిస్తున్నారని, ఇది నా
జీవితంలో చీకటి రోజు అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుడు నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా అని మిథాలీ ట్వీట్‌ చేశారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లాడ్‌తో జరిగిన సెవిూఫైనెల్‌ మ్యాచ్‌లో మిథాలీని తప్పించారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు. వారి వల్లే తనకు న్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌, మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని, లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పొవార్‌ బోర్డుకు అందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.