ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించండి తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల తహసిల్దార్ బి మల్లికార్జున రావుకు  రెవెన్యూలోని ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం కోడేరు మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ మల్లికార్జున్ రావు కు మంగళవారం రోజు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు పి శివశంకర్ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ లు మాట్లాడుతూ రెవెన్యూలో వాళ్ళు ఆప్షన్స్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతోటి భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని మంత్రివర్గ ఉప సంఘం సూచించిన విధంగా అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చి భూ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని వారు అన్నారు మూడు సంవత్సరాలు కావస్తున్నా ధరణి పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు   రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాలే నిదర్శనమని వారు విమర్శించారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన లక్ష రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన పంట రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్లస్థలాలు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని వారు
 డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా పోడు రైతులకు అక్కు పత్రాల కోసం ఉద్యోగ ఫలితంగా ప్రభుత్వము సబ్ కమిటీని ఏర్పాటు చేయడం శుభసూచకమని వెంటనే ఆర్హులైన పోడు రైతులకు అక్కుపత్రాలు ఇచ్చే విధంగా జిల్లా అధికారులు కృషి చేయాలని వారు అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు కేఎల్ఐ సాగునీరు వచ్చే విధంగా కృషి చేయాలని తెగిపోయిన కాలువలను వెంటనే మరమ్మతు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటయ్య, నాగేంద్రం, శ్రీను, రాములు, శివ తదితరులు పాల్గొన్నారు.