నర్సంపేట నియోజక వర్గం లో ఆధునిక వ్యవసాయ దిశగా నర్సంపేట రైతాంగo
జనం సాక్షి : నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగంలో ప్రారంభమైన నూతనాధ్యాయం . ఈ ప్రాంతంలో మొట్ట మొదటిసారిగా లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపారు.
నేడు ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేసి, సాగును ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
గతంలో ఫీల్డ్ విజిట్ కొరకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన నర్సంపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు రైతులు. ఆయిల్ ఫామ్ కు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ మరియు ఆయిల్ ఫామ్స్ సాగు చేస్తున్న రైతులు.
అదే స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గ ప్రాంతంలో లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించాలని నిర్ణయించిన రైతులు. నేడు
ఖానాపురం మండలంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కల పంపిణీ చేసి , స్వయంగా తానే ఆయిల్ మొక్కలను నాటి సాగును ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది.
నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి చూపిన రైతాంగం.
ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో 2 కోట్ల, 26 లక్షల మొక్కలతో 1, 379 రైతులు ప్రారంభించనున్న సాగు.
90% సబ్సిడీతో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులందరికీ వ్యవసాయ మరియు ఆర్టికల్చర్ శాఖల ద్వారా ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చేంతవరకు పూర్తిస్థాయిలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించనుంది.
ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, వ్యవసాయ మరియు ఆర్టికల్చర్ శాఖాధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
