*నర్సింహలపేట పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన తొర్రూరు డీఎస్పీ ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు*

డోర్నకల్ ప్రతినిధి సెప్టెంబర్ 30 (జనం సాక్షి): నరసింహుల పేట పోలీస్ స్టేషన్‌ను సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం తొర్రూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జి.వెంకటేశ్వరబాబు సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి ఎన్నికల సమయం కావడంతో విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సైబర్‌ క్రైమ్‌, గంజాయి, నల్లబెల్లం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు.

డీఎస్పీ పర్యటనలో స్థానిక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఐ) సతీష్‌, తొర్రూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ) సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. అలాగే ప్రజలతో మమేకమై వారి ఫిర్యాదులను విని సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక పోలీసులు చేస్తున్న కృషిని డీఎస్పీ అభినందించారు.