నివేదిక సమర్పించిన మంత్రుల కమిటీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై విశ్లేషణ, భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన మంత్రుల కమిటీ ప్రాథమిక నివేదికను నేడు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులకు సమర్పించింది. ప్రధానంగా పార్టీ ప్రస్తుత పరిస్థితులను వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలను కమిటీ నివేదికలో పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు సూచించినట్లు తెలిసింది.