నెహ్రూ సెంటర్లో సిసి రోడ్డు పనులు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 13(జనం సాక్షి)
రంగశాయిపేటలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ విగ్రహం సెంటర్లో పూర్వవైభవం తీసుకురావడానికి ఈ సెంటర్ తో పాటు గడిమైసమ్మ రోడ్డు వరకు నూతనంగా సిసి రోడ్డును మంజూరు చేయించి, పనులను జరిపించుచున్నామని 42 వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ అన్నారు.
గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో 44 లక్షల రూపాయల కార్పొరేషన్ జనరల్ ఫండ్ నిధులతో మంజూరు చేయించిన సిసి రోడ్డు పనులను కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ పరిశీలించినారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క సిసి రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కువ కాలం మన్నిక ఉండేటట్లుగా, వేసిన రోడ్డు మీద నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులను మరియు కాంట్రాక్టర్ ను కోరారు.
రంగశాయిపేట లోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ నెహ్రూ విగ్రహం కూడలిలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి గానూ కొత్తగా సిసి రోడ్డును వేయాలని, అంతేకాకుండా గడి మైసమ్మ సెంటర్ వరకు కూడా సిసి రోడ్డును విస్తరించాలన్న డివిజన్లోని ప్రజలందరి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతాల్లో సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని గుండు చందన పూర్ణచందర్ తెలిపారు. నెహ్రూ విగ్రహం సెంటర్ లో రెండు కల్వర్టులను నిర్మించడంతో పాటు ఈ సెంటర్ నుండి గడి మైసమ్మ వరకు ఇరువైపులా కూడా డ్రైనేజీలను నిర్మించి, ఇరువైపులా కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీలను అన్నింటిని కూడా రిపేరింగ్ చేయించాకే ఒక ప్రణాళిక బద్దంగా ఈ సీసీ రోడ్డును వేయిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే రోడ్డు నిర్మాణ విషయంలో కొంత ఆలస్యం జరిగిందని, అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు కొంత అసౌకర్యం కూడా కలిగినందున డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో సహకరించినందులకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా డివిజన్ అభివృద్ధి విషయంలో భాగస్వాములు అయి, సలహాలను సూచనలను అందించాలని గుండు చందన పూర్ణచందర్కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈ హబీబొద్దీన్, వర్క్ ఇన్స్ పెక్టర్లు శ్రీనివాస్, మహేష్, సుధాకర్ గార్లతో పాటు స్థానిక పెద్దలు ముత్తినేని రామమూర్తి, బివి రామకృష్ణ ప్రసాద్, బొలిశెట్టి కమలాకర్, శెంకేషి కిషోర్, రావుల ప్రవీణ్, సురేష్, మహేష్, ఎలుగు అశోక్, కొక్కొండ భాస్కర్, గుండు నవీన్ కుమార్, ఆడెపు రఘు, దున్నాల సుందర్, మహేందర్* తదితరులు పాల్గొన్నారు.