నేటి నుంచి పార్లమెంటు బడ్డెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ సజావుగా సాగాలంటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశమనంతరం షిండే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మూడు నెలల పాటు కొనసాగే బడ్డెట్‌ సమావేశాల్లో హెలికాప్టర్ల కుంభకోణంపై తీవ్ర దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెలికాప్టర్ల కుంభకోణం, దేశంలో మహిళల భద్రత, ధరల పెరుగుదల, కురియన్‌ వ్యవహారం, పాక్‌ సరిహద్దులో ఇద్దరు భారత సైనికుల తలలు నరికివేత, చమురు ధరల పెంపు తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి.