పంథాను పాక్ మార్చుకోని పక్షంలో పాక్ ముక్కలై పోతుంది: రాజ్‌నాథ్ సింగ్

 న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోసే విధానానికి పాక్ స్వస్తి  పలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. తన పంథాను పాక్ మార్చుకోని పక్షంలో ఆ దేశం ముక్కలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్‌ను బయటి శక్తులేవో విడదీయాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం మానకుంటే ఆ దేశం తనంత తానే ముక్కలవుతుంది. కులం, మతం ప్రాతిపదికన ఆ దేశం చీలిపోతుంది.’ అని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ సైన్యం నిరంతరంగా అప్రమత్తంగా ఉంటోందని..దేశంలోకి ప్రవేశించిన పాక్ సైనికులు తిరిగి వెనక్కు వెళ్లలేరని వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖ దాటి వెళ్లకూడందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు వెనుకు కారణం ఇదేనని తెలిపారు.