పరిస్థితులపై భారత్‌ అప్రమత్తం

శాంతియుత యుద్ద పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటన

ఉక్రెయిన్‌లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
యుద్దం నేపథ్యంలో వెనక్కి మళ్లిన ఎయిర్‌ ఇండియా విమానం
న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌` రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. భారత్‌ ఈ అంశంపై తటస్థ వైఖరి అవలంభిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటు న్నట్లు వెల్లడిరచింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతపై దృష్టి పెట్టామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అత్యవసర సమాచారం కోసం.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని వివరించింది. ఉక్రెయిన్‌లో తాజా ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రదేశాలకు వెళ్లొద్దని కోరింది. ’ఉక్రెయిన్‌లో తీవ్ర
అనిశ్చితి నెలకొంది. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హాస్టళ్లు, ఇళ్లు, వసతి గృహాలు ఇలా ఎక్కడున్నవారు అక్కడే సురక్షితంగా ఉండండి. పశ్చిమ ఉక్రెయిన్‌ ప్రాంతాల నుంచి రాజధాని కీవ్‌కు బయల్దేరిన వారు తిరిగి విూ ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిపోండి’ అని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది. అలాగే తదుపరి ఎదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది. అప్పటి వరకు ఎక్కడున్నవారు అక్కడే భద్రంగా ఉండాలని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్‌లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని కాగా, ఉక్రెయిన్‌ విమానాశ్రయంలో పలువురు భారతీయుల స్వదేశానికి వచ్చేందుకు పడిగాపులు కాస్తున్నారు. విమానాశ్రయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ’కొన్ని గంటలుగా విమానం కోసం ఎదురుచూస్తున్నాం. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఎవరూ స్పందించట్లేదు’ అని వాపోయారు. అయితే, ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం ఉద్రిక్తతల నేపథ్యంలో.. మార్గమధ్యలో ఉండగానే దిల్లీకి తిరుగుపయనమైంది. అయితే, భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర దారులను అన్వేషిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అక్కడి భారత పౌరులు, విద్యార్థుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పింది. రష్యా దాడికి ముందు.. బుధవారం అర్ధరాత్రి ఐరాస భద్రతామండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే, ఈ ప్రాంతం అస్థిరంగా మారుతుందని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు.. పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ప్రస్తుత పరిస్థితులపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే.. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్త వాతావరణం మరింత దిగజారేందుకు దోహదం చేసే అన్ని చర్యలకు దూరంగా ఉండాలి. ఈ సంక్షోభం పరిష్కారానికి స్థిరమైన దౌత్య మార్గాలే తగినవని భారత్‌ విశ్వసిస్తోంది. ఈలోగా శాంతి భద్రతల పరిరక్షణకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది’ అని భారత్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఆయా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనదేశం సూచించింది.