పాక్‌పై భారత్‌ చేసిన ఫిర్యాదును తిరస్కరించిన ఐసీఏవో

న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జనం సాక్షి ) : ప్రధాని నరేంద్ర మోడీ విమానానికి పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ వాడుకునేందుకు ఆ దేశం అనుమతి ఇవ్వకపోవడంతో భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) కు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వీవీఐపీ అయిన మోడీ
పైలట్‌ కు అనుమతి ఇవ్వాలని, అయితే పాక్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భారత్‌ తన ఫిర్యాదు లో తెలిపింది. అంతర్జాతీయ పౌరవిమానయాన ఒప్పందం అనే ద్వారా ఐసీఏవో సంస్థ కేవలం ప్రభుత్వాల మధ్య పౌరవిమానయానాలకు మాత్రమే సహకారం అందిస్తుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వాధినేతలు ప్రయాణించే విమానాలను సదరు దేశపు ప్రభుత్వ విమానాలుగా పరిగణిస్తారు కాబట్టి వాటికి ఎఅంక్ష ఒప్పందం వర్తించదని తెలిపారు. మిలటరీ విమానాల విషయంలో కూడా పక్క దేశం అభ్యంతరం పెడితే  తమ సంస్థ మధ్యవర్తిత్వం చేయదన సదరు వ్యక్తి తెలిపారు. రెండు దేశాల(ఇండియా, పాకిస్తాన్‌) మధ్య పబ్లిక్‌ వెళ్లే విమానాలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే ఈ సంస్థ జోక్యం చేసుకుంటుందీ కానీ,  ఆయా దేశ నేతలు( భారత ప్రధాని లేదా పాకిస్తాన్‌ ప్రధాని)  పొరుగు దేశం విూదుగా ప్రయాణించేందుకు అభ్యంతరాలుంటే జోక్యం చేసుకోదని చెప్పారు. సోమవారం సౌదీ అరేబియాకు వెళ్లేందుకు ప్రధాని మోడీ విమానానికి ఓవర్‌ పైలెట్‌ క్లీయరెన్స్‌ ఇవ్వాలని పాక్‌ ను భారత్‌ కోరింది. జమ్మూకాశ్మీర్‌ లో మానవ హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. అనుమతి ఇచ్చేది లేదని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషి  ఆదివారం ప్రకటించారు. దీంతో భారత్‌ పాక్‌ పై ఎఅంక్ష కి ఫిర్యాదు చేసింది.