పుణెలో ఓ డాక్టర్‌ ఘాతుకం

కట్నం కోసం భార్యకు వేధింపులు
హెచ్‌ఐవి రక్తాన్ని ఎక్కించిన దుర్మార్గుడు
పూణె,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): దుర్మార్గుడైన ఓ డాక్టర్‌ కట్నం కోసం భరా/-కు హెచ్‌ఐవి వైరస్‌ ఎక్కించాడు. ఇప్పుడు విడాకుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  తనకు హెచ్‌ఐవీ వైరస్‌ను ఎక్కిచ్చాడని పేర్కొంటూ అతగడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డాక్టర్‌ భర్తే సెలైన్‌  ద్వారా ఈ వైరస్‌ను శరీరంలో చొప్పించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  2015లో తమకు వివాహమైందని, అప్పటి నుంచి భర్త, అత్తామామలు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ కోపంతోనే ¬మియోపతి వైద్యుడైన తన భర్త గతేడాది తాను అనారోగ్యం పాలైనప్పుడు సైలెన్‌ ఎక్కించాడని, అందులో హెచ్‌ఐవీ వైరస్‌ సోకిన వారి రక్తం కలిపాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు భర్త విడాకులు కావాలని వేధిస్తున్నాడని వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధితురాలు మళ్లీ అనారోగ్యం బారిన పడ్డప్పుడు పరీక్షలు చేయగా అమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్లు మొదటిసారిగా తెలిసింది. అదే సమయంలో భర్తకూ పరీక్ష చేస్తే నెగటివ్‌ అని తేలింది. తర్వాత ఇటీవల మేం భార్యాభర్తలిద్దరికీ ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించగా.. ఇద్దరికీ హెచ్‌ఐవీ వైరస్‌ సోకినట్లు తేలింది. అంతకుముందు వారు ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించుకున్నప్పుడు కేవలం భార్యకు మాత్రమే వైరస్‌ సోకినట్లు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై వరకట్న వేధింపులు, విషప్రయోగం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.