పెట్రోల్ బంక్ లపై విజిలెన్స్ అధికారుల దాడులు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)
వరంగల్ రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి శోభన్ కుమార్ ఆధ్వర్యంలో మరియు లీగల్ మెట్రాలజీ, ఫైర్ సేఫ్టీ అధికారి, సివిల్ సప్లై వరంగల్ సంయుక్తంగా కలిసి వరంగల్ లో నాయుడు పెట్రోల్ పంప్ , నిషిత పెట్రోల్ పంప్, వరంగల్ జిల్లాలో బుధవారం తనిఖీలు నిర్వహించినారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లగించినందుకు జరిమానా విధిస్తూ, తదుపరి చర్యలక డిటిసిఎస్ వరంగల్ కు అప్పగిoచారు. ఈ దాడులలో విజిలెన్స్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభన్ కుమార్ ,డి.ఎస్.పి రాజు అనిల్ కుమార్, హన్నన్, లీగల్ మెట్రోలాజి ఇన్స్పెక్టర్ రియాజ్, ఎఫ్ ఎస్ ఓ నాగరాజు, డిటిసిఎస్ కిరణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.