పెరోల్‌పై విడుదలైన నళిని

చెన్నై,జూలై25(జ‌నంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవితకాల జైలు శిక్షను అనుభవిస్తున్న ఎస్‌.నళిని శ్రీహరన్‌ పెరోల్‌పై విడుదల అయ్యింది. వెల్లూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి గురువారం ఆమె బయటకు వచ్చారు. నెల రోజుల పెరోల్‌పై ఆమె విడుదల అయ్యారు. కూతురు పెళ్లి కారణంగా నళినికి పెరోల్‌ మంజూరీ చేశారు. ఈనెల 5వ తేదీన మద్రాస్‌ హైకోర్టు ఆమెకు పెరోల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 161 ప్రకారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయవచ్చు అంటూ 1994లో ప్రభుత్వం ఓ స్కీమ్‌ను తీసుకువచ్చింది. దాని ప్రకారం రిలీజ్‌ చేయాలంటూ నళిని ఇటీవల తన పిటిషన్‌లో వేడుకున్నది. తన కుమార్తె పెండ్లి కోసం 6 నెలల సాధారణ సెలవులివ్వాలని కోరుతూ నళిని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేశారు. 27 ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆమె.. తన లీవ్‌ పిటిషన్‌పై స్వయంగా వాదించేందుకు తనను సుప్రీంకోర్టులో హాజరుపరిచేలా ఎస్పీని ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆమె వాదనలు ఎలా ఉన్నాకూతురి పెళల్‌ఇ కోసం ఆమెకు పెరోల్‌ మంజూరు చేసింది. కూతురు లండన్‌లో ఉంటోంది.