పోరూరులో భారీ అగ్నిప్రమాదం

బెంగుళూరు ఘటన తరహాలో కార్లు దగ్ధం
చెన్నై,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): బెంగుళూరు ఘటన మరువక ముందే  పోరూర్‌లోని ప్రైవేట్‌ కార్‌ పార్కింగ్‌ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 200లకు పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఐదు ఫైర్‌ ఇంజిన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. కొంతమంది మంటల్లోనే చిక్కుకున్నట్లు సమాచారం. మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో శనివారం పార్కింగ్‌ ప్రదేశంలో మంటలు చెలరేగి 300లకు పైగా సందర్శకులు కార్లుబుగ్గిపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన తరవాత ఇప్పుడు అదేస్థాయిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఇదిలావుంటే కర్ణాటకలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. యలహంక ఎయిర్‌ బేస్‌ ్గ/ర్‌ యాక్సిడెంట్‌ కు తోడు బందీపూర్‌ అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగింది. గత రెండు రో?లుగా ఈ కార్చిచ్చు కర్నాటక వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నది. దాదాపు 200 ఎకరాల
అడవి భస్మీపటలమైంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే గాలులు బలంగా వీస్తుండటంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.