పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమం….
అంగన్వాడి కేంద్రంలో పోషణ మాంసం గురించి అవగాహన సదస్సు….
బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి:జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్లు కనకలక్ష్మీ,బాబాలక్ష్మీ పోషణ వారోత్సవాలను పురస్కరించుకొని పోషకాహార విలువలపై గర్భిణీలకు, బాలింతలకు చిన్నారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమంమని,గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు, ఆకుకూరలు కూరగాయలు పాలు, గుడ్లు మాంసం చేపలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు, దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని తెలియజేశారు, బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన తొందరగా కోలుకోలేరని పూర్తి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు.బరువు తక్కువ పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారికి అదనంగా ఒక గుడ్డు 100ఎంఎల్ పాలు బాలామృతం ప్లస్ ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాట్లు, ప్రతినెల పిల్లల బరువులు తీయించుకొని వారి గ్రోత్ ను తెలుసుకోవాలని తల్లులకు తెలియజేశారు. విటమిన్లు మినరల్స్ అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడి ఆయాలు కోలుగూరి మమత,కోలుగూరి కాస్తూరి, తదితరులు పాల్గొన్నారు…