ప్రజలే నా ఆస్థి..పేదల బ్రతుకు మార్చడం నా ద్యేయం..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి)
వరంగల్ 35 వ డివిజన్ మైసయ్యనగర్ లో ఇంటి నెంబర్ల పంపిణి,మరియు మిషన్ భగీరథ నళ్ళా నీళ్ళ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు..పేదలకు ఇంటి నెంబర్ల పంపిణీ చేసారు,మిషన్ భగీరథ నీటిని ప్రారంభించారు..కాలనీ వాసులు,మహిళలు డప్పు చప్పుల్లు,బోనాలతో ఎమ్మెల్యే నరేందర్ కు ఘనస్వాగతం పలికారు..అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.
పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానిది..పేదల కనీస వసతులు ఏర్పాటు చేయడం మా బాద్యత…ఈ ప్రాంతంలో నేడు రోడ్లు,డ్రైనేజీ కాలువలు అద్బుతంగా తీర్చిదిద్దాం..నాటికి నేటికి తేడా మీరే గమనిస్తున్నారు.అభివృద్ది మీ కళ్ళ ముందు ఉందని ఎమ్మెల్యే అన్నారు
ఈ ప్రాంతానికి ఎన్నో ఏండ్లుగా ముంపు సమస్య ఉంది..దాన్ని శాశ్వతంగా దూరం చేయాలని కంకణం కట్టుకున్నాం..43 కోట్లతో ఆ దిశగా పనులు చేపట్టాం..పనులు వేగంగా జరుగుతున్నాయి.
– పేదలంటే నాకు ప్రేమ ఎక్కువ..మీలోనుండే నేను వచ్చాను..నేనుండగా ఈ ప్రాంతాన్ని అన్ని విదాల అభివృద్ది చేస్తా అన్నారు
GO 58,59 ప్రకారం ఇండ్ల పట్టాలు అందిస్తున్నం..నేడు ఇంటి నెంబర్లు అందించాం,భగీరథ నీళ్ళందించడం సంతోషంగా ఉంది..ఇచ్చిన హామీలన్నీ తీర్చుతా..పేదవారి సొంతింటి కళ నిజం చేస్తాం.. కానీ ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు
మేయర్ గా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానించారో,నేడు అంతకు మించిన ప్రేమతో స్వాగతం పలికారు..పేదలకు సేవ చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు..పేదలకు భరోసాను ఇవ్వటమే నిజమైన నాయకత్వం.. ఆ దిశలోనే అడుగులేస్తున్నాం..అభివృద్ది చేస్తున్నాం అన్నార
సమైక్య పాలనలో అబద్దాలతో అరచేతిలో వైకుంఠం చూపించారు..కానీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు అద్బుత ఫలాలందిస్తున్నారు..ఈ అభివృద్ది ప్రయాణం ఆగేది కాదు..నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది..
ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం..తద్వారా మన బిడ్డలకు ఉపాది అవకాశాలు దక్కుతాయి,కొత్త పించన్లు అందజేస్తున్నం..ఒకటి రెండు మిస్ అయినా తిరిగి అందజేస్తాం..పని చేసే నాయకులను ఎన్నుకోండి,గఫ్ఫాలు కొట్టే నాయకులకు బుద్ది చెప్పండి..
కలెక్టర్ కార్యాలయం ఈ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది..ఈ ప్రాంతానికి ప్రభుత్వ భవన సముదాయాలు వస్తున్నాయి..ఈ ప్రాంతంలో వ్యాపారాలు అభివృద్ది జరుగడంతో పాటు ఆస్థుల విలువలు పెరుగుతాయి..అద్బుతమైన మోడల్ మార్కెట్ నిర్మిస్తున్నం,పేదలకు నాణ్యమైన,తక్కువ దరకు కూరగాయలు,నిత్యవసరాలు లబించేలా చర్యలు చేపట్టాం అని ఎమ్మెల్యే తెలిపారు
నియోజకవర్గాన్ని విద్య, వైద్యం,అభివృద్ది సంక్షేమంలో ముందుంచుతా..మీ రుణం తీర్చుకుంటా,మీ పిల్లల భవిష్యత్ ను బంగారుమయంగా మార్చుతాం..జంతర్ మంతర్ గాల్లు వస్తుంటారు..వాళ్ళను నమ్మి మోసపోవద్దు..ప్రజలకు సేవ చేసేవాళ్ళను ఎన్నుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్,దిడ్డి కుమారస్వామి,బోగి సురేష్,ముఖ్య నాయకులు,మైసయ్యనగర్ అభివృద్ది కమిటి సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area