ప్రధాని మోడీతో సిఎం వైఎస్‌ జగన్‌ భేటీ

– వివిధ అంశాలపై చర్చ..నిధుల విడుదలకు వినతి
– రైతు భరోసా పథక ఆరంభానికి ఆహ్వానం
న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం మోడీతో సమావేశమయ్యారు. ఎపికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరే అవకాశం ఉంది. అదే విధంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సిఎం జగన్‌ వివరిస్తున్నట్లు తెలిసింది.  అలాగే వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరే అవకాశం ఉంది. అదే విధంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరిస్తున్నట్లు తెలిసింది.  అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధానంగా విభజన హావిూల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించనున్నారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల విూదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.