ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించి ఆదుకోవాలి
హుజూర్ నగర్ డిసెంబర్ 12 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీలలో గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించి ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణం కేంద్రంలోని స్థానికంగా నిర్వహించిన తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం హుజూర్నగర్ పట్టణ కమిటీ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యాదవ, గొల్ల ,కురుమలకే కాకుండా రాష్ట్రంలో వివిధ పట్టణ ప్రాంతంలో ఉన్న యాదవ ,గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టారని ,సూర్యాపేట జిల్లాలో మాత్రం మునిసిపాలిటీలలో పెంపకం దార్లకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయకపోవడం గొర్రెల , మేకల పెంపకం దారులను మోసం చేయడమేనని విమర్శించారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలలో గొర్రెల , మేకల పెంపకం దారుల వృత్తి అత్యధికంగా ఉందని అనేక సొసైటీలు మగా ఏర్పాటు చేసుకొని పెంపకం దారులు వృత్తిని కొనసాగిస్తున్నారని వారికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించి ఆదుకోవాలని కోరారు. హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న సొసైటీలలో సభ్యత్వం లేక అనేకమంది గొర్రెల ,మేకల పెంపకం దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సొసైటీ అధ్యక్షులు వారికి సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం మూలంగా పెంపకం దారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారని తక్షణమే జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు కలుగజేసుకొని అర్హులైన పెంపకందారులందరికీ సొసైటీలో సభ్యత్వం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గీత ,మత్య ,చేనేత కార్మికులకు ఇస్తున్నట్లుగానే 50 సంవత్సరాలు నిండిన గొర్రెల ,మేకల పెంపకం దారులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంపకం దారులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా వర్తింపచేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యాదవ, గొల్ల ,కురుమలకు సొసైటీలో సభ్యత్వం ఇచ్చి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. వివిధ కారణాల రీత్యా మరణించిన గొర్రెల కాపరుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకను సొసైటీలో సభ్యులుగా చేర్చి పెంపకం పంపిణీ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. పెంపకం దారు ల సంఘం పోరాట ఫలితంగా సాధించుకున్న 1016 ,559 జీవోలను ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. జిఎం పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పాశం వెంకట్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో , జిఎంపిఎస్ పట్టణ నాయకులు పాశం వీరబాబు, ఏష బోయిన సైదులు, ఆవుల యాదగిరి, బొల్లం వెంకన్న , గోపన బోయిన సైదులు, కోడి నరేష్, జక్కల బిక్షం ,ఏష బోయిన మహేష్, వల్లాల జానయ్య , ఎల్లావుల వెంకన్న, బండ గొర్ల శ్రీశైలం, నల్ల మాద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.