ప్రమాదం నుంచి బయటపడ్డ ఎయిర్‌ ఇండియా విమానం

స్టాక్‌¬మ్‌లో గోడను ఢీకొన్న విమానం
179 మంది ప్రయాణికులు క్షేమం
స్టాక్‌¬మ్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): ఎయిర్‌ ఇండియా విమనాం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అంతేగాకుండా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.  స్వీడన్‌ రాజధాని స్టాక్‌¬మ్‌లో  ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఒక భవనాన్ని ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు గురించి ఇంతవరకూ తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులందరినీ సురక్షితం విమానం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు.   స్టాక్‌¬ంలోని ఆర్లాండా ఎయిర్‌పోర్టులో విమానం రెక్క సవిూపంలోని ఒక తలుపును ఢీకొంది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం బుధవారం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమానంలోని 179 మంది ప్రయాణికులను మొబైల్‌ మెట్ల మార్గంలో దింపేశారు. ఆ తర్వాత విమానాన్ని టర్మినల్‌లోకి తీసుకొచ్చామని
స్థానిక పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ ఏఐ167 బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం స్టాక్‌¬ంలోని ఆర్లాండా విమానాశ్రయలోని టర్మినల్‌ 5లో ఎఫ్‌28ఎల్‌ గేటు గోడను ఢీకొంది. వాస్తవానికి ఇక్కడ విమానాలు వచ్చేందుకు ఎఫ్‌28ఎల్‌, ఎఫ్‌28ఆర్‌ అనే రెండు మార్గాలు ఉన్నాయి. వీటిల్లో ఎఫ్‌28ఆర్‌ అనే మార్గాన్ని బోయింగ్‌ డ్రీమ్‌లైనర్లకు వినియోగిస్తారు. ఈ మార్గం ఎఫ్‌5 టర్మినల్‌ వద్ద భవనానికి కొంచెం దూరంగా ఉంటుంది. విమానం ఎఫ్‌28ఎల్‌ మార్గంలోకి వెళ్లాలని సూచనలు రావడంతో పైలట్‌ అటువైపు మళ్లించాడు. దీంతో ప్రమాదం చోటు చేసుకొంది.