ప్రయాణికులను కత్తి పొడిచిన దుండగుడు, ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా తడి వద్ద ఓ ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చైన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ దుండగుడు ప్రయాణికులను కత్తితో విచక్షణారహింతంగా పొడిచాడు. ఆర్టీసీ బస్సులో ఓ దుండగుడు ప్రయాణికులను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ సంఘటలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి పరిస్థితి  విషమంగా ఉంది. మృతులను ఒడిషాలోని మల్కాస్‌గిరిజిల్లాకు చెందిన అజయ్‌ బిశ్వాస్‌, కావలికి చెందిన లెక్చరర్‌ ఉప్పల నిరంజన్‌, ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. చికిత్స నిమిత్తం అతడిని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులపై దాడికి పాల్పడిన వ్యక్తి కృష్ణా జిల్లాలో పోలీసుల నుంచి తప్పించుకున్న సైకో సాంబశివరావుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్‌టీం ఆధారాలు సేకరిస్తోంది.

తాజావార్తలు