ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు సంక్షేమ పథకాలు అమలు చేయండిః అమిత్‌ షా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24జనం సాక్షి  :  ప్రభుత్వ పథకాల సాయంతో ప్రైవేటు గార్డులకు కూడా ఆరోగ్య బీమా, ఆరోగ్య పరీక్షలు, పెన్షన్‌ వంటి పథకాలను వర్తింపచేయాలని ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ఆపరేటర్లకు
మంగళవారం కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా సూచించారు.
ఎన్‌సిసిలో శిక్షణ పొందిన వారిని గార్డులుగా నియమిస్తే వారికి భద్రత విషయంలో ప్రాథమిక శిక్షణ ఉంటుందని ప్రైవేటు ఏజెన్సీలకు సలహా ఇచ్చారు.
అంతర్గత వ్యవహారాల శాఖ చొరవతో ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల లైసెన్సింగ్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తూ, ప్రతి ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌కు కూడా వేతనాలు ఇచ్చేందుకు  ‘జన్‌ ధన్‌’ బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరిగా ఉండాలని, వారితో నగదు లావాదేవీలు చేయరాదని చెప్పారు.
దేశంలో దాదాపు 90లక్షల మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఉండగా, పోలీసు, పారామిలటరీ దళాల మొత్తం సంఖ్య 30 లక్షలు అని ఆయన చెప్పారు. అంటే, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు 76శాతం ఉండగా, 24శాతం మంది పోలీసులు ఉన్నారని అన్నారు.