ఫెర్గూసన్‌లో ఎమర్జెన్సీ

అమెరికాలోని పెర్గూసన్‌ నగరంలో అత్యయికస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. ఏడాది క్రిందట శ్వేతజాతి పోలీసుల చేతిలో చని పోయిన నల్లజాతి యువకుడు మైఖేల్‌ బ్రౌన్‌ వర్ధంతి సందర్భంగా గత రాత్రి నిర్వహించిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఇది చివరికి కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. డజన్ల కొలదీ పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో సోమ వారం మధ్యాహ్నం నుంచి అత్యయికస్థితి ఉత్తర్వులు అమలు చేయనున్నట్లు సెయింట్‌ లూయీస్‌ కౌంటీ ప్రతినిధి స్టీవ్‌ స్టెంజర్‌ తెలిపారు. ‘ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసతో ఫెర్గూసన్‌లో అశాంతి నెలకొంది. ప్రజలకు హాని, ఆస్తి విధ్వంసం జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో కౌంటీ ప్రతినిధిగా అత్యయిక స్థితి ప్రకటిస్తున్నాను’ అని స్టెంజర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు