బంగారు తెలంగాణ దిశగా కెసిఆర్ అడుగులు..
70 ఏళ్లుగా ప్రతిపక్షాలు చేసిన గబ్బును తొలగించడమే టిఆర్ఎస్ లక్ష్యం.
– పార్టీలు కాదు పనిచేసే నాయకుడు కావాలి.
– పనిచేసేవారికే ప్రజలు పట్టం కట్టాలి.
– దేశంలో ఎక్కర లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది.
– పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 19 (జనంసాక్షి):
ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని విధంగా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రివర్యులు, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని రాచాలపల్లి, రేవల్లి, మాదారం, ఊరుకొండ పేట, ఇప్పపహాడ్ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన నిర్వహించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా గ్రామాలలో ప్రజలు బ్యాండ్ మేళాల మధ్య ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. రాచాలపల్లి గ్రామంలో ఆసరా పింఛన్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రేవల్లి గ్రామంలో జడ్పిటిసి శాంతకుమారి రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ప్రకటించడం పట్ల కెసిఆర్ కు పాదాభివందనం చేస్తున్నట్లు బహిరంగంగా తెలిపారు. రేవల్లి గ్రామం నుండి మాదారం మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యేకు విన్నపించారు. వైద్య నిమిత్తం ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించి వైద్య సేవలు అందే విధంగా చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తాగునీరు సాగునీరు, విద్యుత్ సరఫరా, దళిత బంధు, గిరిజన బందు, వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు నోటికొచ్చిన మాటలు మాట్లాడడం చేతకానితనానికి నిదర్శనమని మండి పడ్డారు. కేంద్రంలో బిజెపి అంటే బడ జూట పార్టీ అని విమర్శించారు. ప్రజల నిత్యవసరాలు అయిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అధికంగా పెంచి
బడుగు బలహీన వర్గాల ప్రజల నడ్డి విరుస్తుందని ఎద్దేవ చేశారు. ఆదాని అంబానీలకు పట్టం కడుతున్న బిజెపి పార్టీకి రాబోయే కాలంలో పుట్టగతులు ఉండవని ఆరోపించారు. మాదారం గ్రామంలో రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు కోరిన పతి కోరికను అతి త్వరలో తీర్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఊరుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ సమకూర్చిన టై, బెల్టులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో బక్క రాధజంగయ్య, జడ్పిటిసి శాంత కుమారి రవీందర్, వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ కలీం పాషా,
ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, గిరి నాయక్, బిక్కెరి రాజశేఖర్ రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు విజయమ్మ పాండురంగారెడ్డి, బొబ్బిలి సునీత సాంబశివుడు, దండోద్కర్ అనిత నాగోజి, దుబ్బ వనజ బాలస్వామి, కొమ్ము రాజయ్య,
ఆంజనేయులు, ఎంపీటీసీలు కల్మిచర్ల గోపాల్, లావణ్య అమరేశ్వర్ రెడ్డి, ఈశ్వరమ్మ ముత్యాలు, బుచ్చమ్మ, కానుగుల లక్ష్మమ్మ బుచ్చయ్య,
అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.